హైదరాబాద్‌లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. సిటీ బస్సు శంషాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్‌కు వెళ్తుండగా బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంజన్‌లో పొగలు రావడంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ప్రయాణికులంతా సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. బస్సులో కొంత భాగం మాత్రమే దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : V.Hanumantha Rao : మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్
దీనిపై టీఎస్‌ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో, కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైనప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఆర్టీసీ పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను నడిపేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.
Also Read : Mumbai: ముంబైలో అక్రమ ఫిల్మ్ స్టూడియోలు కూల్చివేత.. బీజేపీ సంబరాలు
