Site icon NTV Telugu

Fire Accident In Sofa Manufacturing Factory: సోఫా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

Fire Accident

Fire Accident

Fire Accident In Sofa Manufacturing Factory: గ్రేటర్ నోయిడాలోని బీటా 2 ప్రాంతంలోని సోఫా తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి మంటలను ఆర్పారు. ఆ తర్వాత లోపల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో లోపల ముగ్గురు సజీవదహనం అయ్యారు. ముగ్గురూ ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలని అగ్నిప్రమాదం సమయంలో ఇక్కడే ఉన్నారని అధికారులు తెలిపారు.

Also Read: UnstoppableS4 : బాలయ్య తో నవీన్ పోలిశెట్టి – శ్రీలీల సందడి

నవంబర్ 26న పోలీస్ స్టేషన్ బీటా 2 ఏరియా పరిధిలోని ఫ్యాక్టరీ నెం. 4G సైట్‌లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ సోఫాలు తయారు చేసే పని జరుగుతుందని, అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపక కేంద్రాల వాహనాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు మృతులని గుర్తించి సమాచారం అందించారు. వీరిలో మధురలోని రాయ పోలీస్ స్టేషన్‌లో నివాసం ఉంటున్న గుల్ఫామ్ (23), బీహార్‌లోని కతిహార్‌లోని బార్సోయి పోలీస్ స్టేషన్‌లోని మజర్ ఆలం (29), అర్హరియా బీహార్‌కు చెందిన దిల్షాద్ (24)గా అధికారులు గుర్తించారు.

Also Read: HMD Fusion: ఊహించని ఆప్షన్స్‭తో మిడ్ రేంజ్‭లో మార్కెట్లోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్

అగ్నిప్రమాదంపై ఏడీసీపీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఫైర్ అధికారులు మంటలను అదుపు చేశారని, సెర్చ్ ఆపరేషన్‌లో లోపల ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారని తెలిపారు. ముగ్గురూ ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలని, మంటలు చెలరేగినప్పుడు లోపల ఉన్నారని అయన అన్నారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని ఆయన అన్నారు. ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక అధికారి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version