హైదరాబాద్ మూసారాంబాగ్ లో ఉన్న ఒక రెడ్ రోజ్ బేకరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో
స్థానికులు భయం తో పరుగు తీశారు. మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగింది అని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి