Site icon NTV Telugu

Fire Accident: గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. ఆగినట్టే ఆగి మళ్లీ ఎగసిన మంటలు..!

Fire Accident

Fire Accident

Fire Accident: విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో మూడంతస్తుల భవనంలో చిన్నగా మొదలైన మంటలు.. క్రమంగా అలుముకొని భారీగా వ్యాపించాయి.. రెండో అంతస్థులో ఉన్న ఆకాష్ బైజుస్ విద్యాసంస్థలో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ఏసీలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్ లు ఉండడం తో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా, ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. అయితే, ఓ దశలో మంటలు అదుపులోకి వచ్చినట్టే అనిపించినా.. మళ్లీ ఒక్కసారిగా ఎగసిపడుటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు అలుముకున్నాయి.. బిల్డింగ్ వెనుక భాగంలో నివాస ప్రాంతాలు ఉండటంతో భయబ్రాంతలకు గురవుతున్నారు ప్రజలు.. ఇక, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version