NTV Telugu Site icon

Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం

Delhi

Delhi

ఢిల్లీ ఎయిమ్స్‌లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. టీచింగ్ బ్లాక్‌లో ఇవాళ తెల్లవారుజామున ఎయిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం అయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 7 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.