Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..

Fire Accident

Fire Accident

హైదరాబాద్ పాతబస్తీలోని ఫతే దర్వాజా ప్రాంతంలో ఒక భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటనలో ఒక మూడు అంతస్తుల భవనం ప్రమాదానికి గురైంది. భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, చూస్తుండగానే దట్టమైన పొగతో పాటు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ ఇంజిన్ల సహాయంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంటిలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణనష్టం తప్పడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. ప్రాథమిక వివరాల ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఎంత ఆస్తి నష్టం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.