Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టేషన్ పరిధిలో నిలిపి ఉంచిన ఒక ఖాళీ రైలు బోగీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోగీ నుంచి దట్టమైన పొగలు, పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఖాళీ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా పలు కీలక రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయి.
Also Read
- Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
- India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
- Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
- Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
అలాంటి కీలక ప్రాంతంలో నిలిపి ఉంచిన బోగీలో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు అసలు కారణాలు ఏమిటనే కోణంలో రైల్వే భద్రతా అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోగీ కాలిపోవడానికి దారితీసిన పరిస్థితులపై సాంకేతిక నిపుణుల బృందం కూడా ఆరా తీస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!