Fire Accident: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు బుధవారం రాత్రి ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీదత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. ఇదే కాంప్లెక్స్‌కు ఆనుకుని తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్ కూడా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దత్త సాయి కాంప్లెక్స్‌లో ఉన్న ఇద్దరిని సురక్షితంగా కిందికి దించారు చిక్కడపల్లి పోలీసులు. ముషీరాబాద్ నుంచి క్రాస్ రోడ్డుకు వచ్చే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉన్న రోగులను అధికారులు బయటకు పంపారు. ఇదే కాంప్లెక్‌లో ఫర్నీచర్ షోరూం కూడా ఉంది. ఫర్నీచర్ షోరూంకు కూడా మంటలు అంటుకున్నాయి. దత్త సాయి కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో ప్లాస్టిక్ గో డౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఫైర్ ఫైటింగ్‌లో ఫైర్ సిబ్బందిలో ఒకరికి శ్వాస కోస ఇబ్బందులు వెంటనే స్థానిక ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. పక్కన ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: IPS Transfer: తెలంగాణలో 15 మంది సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు