Fire Accident: హైదరాబాద్‌లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్‌పల్లి రాజీవ్ గాంధీ నగర్‌లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
GG W vs MI W: హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీతో ముంబై ఘన విజయం.. గుజరాత్‌కు తొలి ఓటమి..!
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ సమీపంలోని ప్రజలను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా ప్రమాణాలు పాటించారా..? లేదా..? గ్యాస్ లీక్ ఎలా జరిగింది..? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Maruthi: హారర్ మూవీస్’లో దెయ్యాన్ని చంపడం ఈజీ.. ఎలాగైనా చంపొచ్చు!
