Site icon NTV Telugu

Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident

Fire Accident

Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని వీఎస్టీ సమీపంలోని ఓ గోదాంలో దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. శుభకార్యాలకు వినియోగించే డెకరేషన్‌ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాం పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిక్కడపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదిలా ఉండగా.. ఆ మంటలు పక్కనే ఉన్న మరో గోదాంకు వ్యాపించాయి. ఓ కంపెనీకి చెందిన కేబుల్ వైర్స్‌, ప్లాస్టిక్‌ మెటీరియల్‌కు మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Gun Fire in Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి..

వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లో డెక్కన్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

 

Exit mobile version