NTV Telugu Site icon

Finland : ప్రపంచంలోనే అత్యంత హ్యాపీయస్ట్ దేశం

Finland

Finland

ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమౌన దేశంగా వరుసగా ఆరోసారి ఈ ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత సంతోషంగా ఉండే దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ ప్రచురిస్తుంది. దీనిని 150కి పైగా దేశాలలో ప్రజల నుంచి వచ్చిన ప్రపంచ సర్వే ఆధారంగా రూపొందిస్తుంది. మార్చ్ 20 ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్య రాజ్యసమితి వార్షిక హ్యాపీనెస్ సూచీ ప్రకారం.. డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశంగా రెండో స్థానంలో ఉండగా.. ఐస్ లాండ్ మూడో స్థానంలో ఉంది.

Also Read : Revanth Reddy: హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజులు బ్రేక్

ఇక వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ నివేదికలో నేపాల్, చైనా, శ్రీలంకల కంటే దిగువున ఉంది. భారత్ 126వ స్థానంలో ఉంది. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా హ్యాపీనెస్ నివేదికలో వాటి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. రష్యా 72వ స్థానంలో ఉండగా.. ఉక్రెయిన్ 92వ స్థానంలో ఉంది. కాగా, ఒక దేశ హ్యాపీనెస్ ని దాని తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితరాల ఆధారంగా కొలిచి హ్యాపీనెస్ సూచీలో స్థానం కల్పిస్తారు. అయితే అనుహ్యాంగా 2021లో ఇతరుల పట్ల దయ చూపడం, ముఖ్యంగా అపరిచితులకు సహాయం చేయడం వంటివి పెరిగాయి. ఇది 2022లో మరింత ఎక్కువగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ పేర్కొంది.

Also Read : Russia : తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం