NTV Telugu Site icon

Union Budget 2023: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Nir

Nir

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను రేపటికి (ఫిబ్రవరి 1వ తేదీ)కి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు.

“భారత్​ జీడీపీ వృద్ధి అంచనాలు.. వరల్డ్​ బ్యాంక్​, ఐఎంఎఫ్​, ఓడీబీ, ఆర్​బీఐ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల బట్టి.. వాస్తవ జీడీపీ.. 6-6.8శాతం మధ్యలో ఉండొచ్చు” అని ఎకనామిక్​ సర్వే స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్​ ముందు స్థాయికి చేరుకుందని ఈ సర్వే స్పష్టం చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్​ తన స్థానాన్ని పదిలం చేసుకుందని వివరించింది. భారత్​కు కొన్ని అంశాల్లో ఉన్న ప్రయోజనాల కారణంగా.. దేశ జీడీపీ 6-6.8శాతం మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.

Union Budget 2023: రాబోయే పాతికేళ్లు ఎంతో కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు

2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 7శాతం. 2021-22లో ఇది 8.7 శాతంగా ఉంది.

పీపీపీ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఎక్స్‌చేంజ్ రేటు పరంగా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది. ఇది ప్రైవేట్ వినియోగాన్ని, పెట్టుబడుల్ని బలహీనపరచలేదు.

Gautam Adani: టాప్-10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్..కారణం ఇదే!

Show comments