Site icon NTV Telugu

Kidnap: ఫైనాన్స్ కంపెనీ అరాచకం.. ఈఎంఐ కట్టలేదని కస్టమర్‌ కూతురి కిడ్నాప్..

Kidnap

Kidnap

Kidnap: ఫైనాన్స్‌ కంపెనీల ఆగడాలు, లోన్‌ యాప్‌ల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. సమయానికి ఈఎంఐ కట్టకపోతే.. రకరకాల రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారు.. ఇప్పటికే లోన్‌ యాప్‌ల వేధింపులు, ఫైనాన్స్‌ సంస్థల టార్చర్‌తో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.. తాజాగా, ఈఎంఐ కట్టలేదని కస్టమర్ కూతుర్ని ఓ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి కిడ్నాప్‌ చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపుతోంది..

Read Also: Best Electric Bike 2023: 2 గంటలు ఛార్జింగ్ పెడితే.. 187కిమీ ప్రయాణం! రూ. 30 వేలకే కొనేసుకోవచ్చు

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వెల్లి జిల్లా మారుత్తూరు గ్రామంలోని ఈ ఘటన జరిగింది. ఓ ఫైనాన్స్ కంపెనీలో 50 వేల రూపాయలు లోన్‌గా తీసుకున్నాడు మారుత్తూరు గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తి.. స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో రాజా పనిచేస్తున్నాడు.. ఉద్యోగం పోవడంతో ఈఎంఐ సరైన టైంకి చెల్లించలేకపోయాడు.. అయితే, ఈఎంఐ కోసం రాజా ఇంటికెళ్లిన ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి విఘ్నేష్‌.. రాజా ఇంటిలో లేకపోవడంతో.. ఇంట్లో ఉన్న 11 ఏళ్ల రాజా కుమార్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు.. ఇక, ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగు చూసింది.. రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక ఆచూకీ కనుగొన్నారు. సురక్షితంగా ఇంటికి చేర్చారు.

Exit mobile version