NTV Telugu Site icon

Filmfare Awards South 2024: ఉత్తమ చిత్రంగా ‘బలగం’.. కేటీఆర్‌ అభినందనలు!

Balagam Ktr

Balagam Ktr

KTR Tweet on Balagam Movie: 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలు, నటీనటులకు అవార్డులు వరించాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ‘బలగం’.. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో బలగం చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

Also Read: IND vs SL: భారత్‌తో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్! 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఎంట్రీ

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడం పట్ల కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న నా సోదరుడు వేణుకు అభినందనలు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. భవిష్యత్‌లో మరిన్ని సాధించేందుకు ఇది తొలిమెట్టు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. బలగం సక్సెస్ అయ్యాక కేటీఆర్‌ సినిమాను అభినందించిన విషయం తెలిసిందే. బలగం సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి అవార్డులు దక్కాయి.

Show comments