Site icon NTV Telugu

Film Workers Strike: నేడు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం.. రేపు తిరిగి చర్చలు ప్రారంభం!

Tollywood

Tollywood

Film Workers Strike: గత నాలుగు రోజుల నుంచి సినీ కార్మికుల వారి వేతనాలకు సంబంధించి సమ్మె చేస్తున్న విషయం విధితమే. ఈ సమ్మెకు సంబంధించి తాజా అప్డేట్ విషయానికి వస్తే.. ఈరోజు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం ఇచ్చారు. అయితే శనివారం (ఆగష్టు 9) తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే గురువారం నాడు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతల 4 ప్రతిపాదనలు ఉంచారు. అవేంటంటే..

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట బండి సంజయ్ హాజరు!

* ఫ్లెక్స్ బుల్ కాల్ షీట్లు కావాలి. 6am to 6pm లేదా 9am to 9pm

* ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటాం. (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల వారితో పని చేయించుకోవటం)

* షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో అనేది ఉండకూడదు.

* సెకండ్ సండే ఫెస్టివల్ డేస్ (ప్రభుత్వం ప్రకటించిన సెలవులు)లో వర్క్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్.. మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్షీట్‌‌.

Kesamudram: అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం!

మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధానంగా 2 ప్రతిపాదనలు పెంచారు. అందులో మొదటిది 30% వేతనాలు పెంచాలని ఒకటికగా.. మరొకటి పెంచిన వేతనాలను ఏరోజుకు ఆరోజు పే చెయ్యాలని. అయితే, నిర్మాతలు 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే వేతన పెంపుపై ఒక నిర్ణయం తీసుకుందామని నిర్మాతలు‌‌ అంటున్నారు. ఈ విషయమై ఈరోజు లేదా రేపు మంత్రి కోమటి రెడ్డిని, చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఇక చివరగా శనివారం నాడు జరిగే చర్చలు సానుకూలంగా రాని పక్షంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేసే ఆలోచనలో సినీ కార్మికులు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version