కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తమిళ ఇండస్ట్రీలో ఆయన తెరకేక్కించిన సినిమాలు ఏ రేంజులో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.. ఆ డైరెక్టర్ ఫస్ట్ టైం ఓ సినిమాను నిర్మించారు.. విజయ్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఫైట్ క్లబ్ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది..
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నది.. ఈ సినిమా వచ్చే నెల 2 న ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఫైట్ క్లబ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ఫై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫైట్ క్లబ్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం..
ఇక ఈ చిత్రాన్ని అబ్బాస్ ఏ రహమత్ దర్శకత్వం వహించాడు. మోనీషా మోహన్ మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ యాక్షన్ మూవీకి 96 ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. లోకేష్ కనగరాజ్ ఫస్ట్ టైమ్ నిర్మించిన సినిమా కావడంతో ఈ చిన్న సినిమా తమిళ ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడింది.. రహమత్ టేకింగ్, స్క్రీన్‌ప్లే తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కుమార్ యాక్టింగ్‌తో మెప్పించాడు.. గత ఏడాది చివర్లో డిసెంబర్ 15 న విడుదల అయ్యింది.