వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 సమీపిస్తుండగా.. ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీపై పడింది. ఈసారి అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి జట్లు టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకోవడం ఎంత గొప్ప విషయమో తెలిసిందే. కానీ ఈ ట్రోఫీ అసలు విలువ ఎంత ఉంటుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
నిజయానికి భావోద్వేగ పరంగా చూస్తే.. ఈ ట్రోఫీ విలువను డబ్బుతో కొలవడం అసాధ్యం. అయితే ఇందులో ఉపయోగించిన పదార్థాల ఆధారంగా లెక్కిస్తే ప్రస్తుతం దీని విలువ సుమారు 2.5 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, ట్రోఫీ తయారీలో అవసరమైన అత్యున్నత స్థాయి నైపుణ్యం కారణంగా దీని విలువ మరింత పెరిగింది. అయితే వాస్తవానికి ఈ ట్రోఫీ విలువ దాని తయారీ ఖర్చుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకవేళ ఈ ట్రోఫీని నేడు వేలానికి ఉంచితే దీని ధర 20 మిలియన్ డాలర్లకు పైగా పలికే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత కరెన్సీలో ఇది రూ.170 కోట్లకుపైగా అవుతుంది.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఎలా తయారవుతుంది?
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఎత్తు 37 cm ఉండగా, బరువు సుమారు 6 కి.గ్రా.లు ఉంటుంది. ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారవుతుంది. ట్రోఫీ డిజైన్ లో ఇద్దరు వ్యక్తులు భూమిని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. ఫుట్‌బాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే క్రీడ అనే సందేశాన్ని ఈ రూపకల్పన ప్రతిబింబిస్తుంది. అయితే చాలామంది అనుకునేలా ఈ ట్రోఫీ పూర్తిగా బంగారంతో తయారై ఉండదు. ట్రోఫీ లోపలి భాగం ఖాళీగా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా బంగారంతో తయారు చేస్తే అది చాలా బరువుగా మారి ఆటగాళ్లు ఎత్తడం కష్టమవుతుంది. ట్రోఫీ అడుగు భాగంలో రెండు పొరల మలకైట్ అనే ఆకుపచ్చ రంగు ఖనిజాన్ని ఉపయోగించారు.
బ్రెజిల్‌కు శాశ్వతంగా వెళ్లిన పాత ట్రోఫీ:
ఈ ట్రోఫీని ఇటలీకి చెందిన శిల్పి సిల్వియో గజ్జనిగా రూపొందించారు. 1970లో ఫిఫా నిర్వహించిన అంతర్జాతీయ డిజైన్ పోటీలో ఆయన రూపకల్పన ఎంపికైంది. అంతకుముందు ఉపయోగించిన జూల్స్ రిమెట్ ట్రోఫీని 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకోవడంతో శాశ్వతంగా ఆ దేశానికి అప్పగించారు. దీంతో కొత్త ట్రోఫీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారిగా 1974లో పశ్చిమ జర్మనీ గెలుచుకుంది. ఆ జట్టుకు దిగ్గజ డిఫెండర్ ఫ్రాంజ్ బెకెన్బావర్ కెప్టెన్‌గా వ్యవహరించారు.
విజేతలకు అసలు ట్రోఫీ దక్కదు:
ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్లో ఇదొకటి. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. ఫైనల్ ముగిసిన వెంటనే అసలు ట్రోఫీని ఫిఫా తన ప్రధాన కార్యాలయం ఉన్న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు తిరిగి తీసుకెళ్తుంది. దాని బదులుగా విజేత దేశానికి బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేసిన ప్రత్యేక రిప్లికా ట్రోఫీని అందజేస్తారు. దీంతో అసలు ట్రోఫీ ఎప్పటికీ ఫిఫా ఆధీనంలోనే ఉంటుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన గుర్తింపుగా నిలిచిన ఈ ట్రోఫీపై ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచ దేశాలు కన్నేస్తుంటాయి.
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..