FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ అట్టహాసంగా మొదలయింది. ఈ ఫుట్‌బాల్ సమరం అభిమానులకు ఎన్నో ఆసక్తికరమైన సమరాలను అందించనుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆటగాళ్లు ఉన్న అందులో చాలామంది దృష్టి మాత్రం ఇద్దరు దిగ్గజాలపై మాత్రమే ఉంటుంది. ప్రపంచ ఫుట్‌బాల్ ను దాదాపు రెండు దశాబ్దాలుగా ఏలుతున్న లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు మరోసారి ఒకే వేదికపై తలపడతారా అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇద్దరూ తమ కెరీర్లో ఆరో ప్రపంచకప్ ఆడబోతున్నారు. ఇది వారి చివరి ప్రపంచకప్ కావచ్చని ఫుట్ బాల్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
క్లబ్ స్థాయిలో ఎన్నోసార్లు ఒకరిపై ఒకరు పోటీపడిన మెస్సీ, రొనాల్డోలు ఇప్పటివరకు ప్రపంచకప్‌లో తమ జాతీయ జట్ల తరఫున మాత్రం ఎదురెదురుగా మాత్రం ఆడలేదంటే నమ్మండి. అయితే 2026 ప్రపంచకప్ లో ఉన్న ఫార్మాట్ కారణంగా ఈ డ్రీమ్ క్లాష్ ఎదురయ్యేట్లుగా కనిపిస్తోంది. దీనికి కారణం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు గ్రూప్-Jలో అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్ జట్లతో కలిసి ఉంది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జూన్ 16న అల్జీరియాతో, జూన్ 22న ఆస్ట్రియాతో, జూన్ 27న జోర్డాన్‌తో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. అర్జెంటీనా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే జూలై 4న జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్-H రన్నరప్‌తో తలపడుతుంది.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
మరోవైపు రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ గ్రూప్-Kలో డీఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియా జట్లతో కలిసి ఉంది. పోర్చుగల్ జూన్ 17న డీఆర్ కాంగోతో, జూన్ 23న ఉజ్బెకిస్తాన్‌తో, జూన్ 27న కొలంబియాతో తలపడనుంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 32లో మరో గ్రూప్ నుంచి వచ్చిన జట్టుతో ఆడుతుంది. అయితే మెస్సీ, రొనాల్డోలు ప్రపంచకప్‌లో ఎదురుపడాలంటే అర్జెంటీనా, పోర్చుగల్ రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలవడంతో పాటు రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లను కూడా గెలవాలి. అలా జరిగితే క్వార్టర్ ఫైనల్లో ఈ దిగ్గజాలు ప్రత్యక్ష పోరుకు దిగే అవకాశం ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సమరం నిజమైతే అది ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోతుంది.
రికార్డుల విషయానికి వస్తే మెస్సీ ఇప్పటికే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26), అత్యధిక నిమిషాలు (2314) ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అర్జెంటీనా తరఫున ప్రపంచకప్‌లో అత్యధికంగా 13 గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోజే (16) రికార్డును అధిగమించడానికి మెస్సీకి మరో మూడు గోల్స్ మాత్రమే అవసరం.
మరోవైపు రొనాల్డో ప్రపంచకప్ లలో కేవలం 8 గోల్స్ మాత్రమే చేశాడు. క్లోజే రికార్డును అధిగమించాలంటే అతడు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అయితే పోర్చుగల్ టోర్నీలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం రొనాల్డోకు ఉంది. ఇక భారత అభిమానులు ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్ లను యునైట్8 స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెళ్లలో వీక్షించవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రసారాలు అందుబాటులో ఉండనున్నాయి.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!