FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ (Germany) తమ ప్రయాణాన్ని భారీ విజయంతో ప్రారంభించింది. జూన్ 14న హ్యూస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కురాకో (Curacao)ను 7-1 తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్‌కు ముందు నుంచే జర్మనీ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. ఆ అంచనాలను నిజం చేస్తూ మ్యాచ్ వన్ సైడ్ లా విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ ప్రారంభమైన కేవలం ఆరు నిమిషాల్లోనే ఫెలిక్స్ న్మెచా అద్భుత గోల్‌తో జర్మనీకి ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత జర్మన్ ఆటగాళ్లు వరుస దాడులతో కురాకోపై ఒత్తిడి పెంచారు. అయితే మ్యాచ్ 21వ నిమిషంలో అనూహ్యంగా కురాకో గోల్ చేసి స్కోర్ సమం చేసింది. లివానో కోమెనెన్సియా అద్భుత గోల్ సాధించి స్కోరును 1-1గా మార్చడంతో స్టేడియంలోని అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
Also Read
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సమం చేసిన తర్వాత జర్మనీ మరింత దూకుడుగా ఆడింది. 38వ నిమిషంలో కార్నర్ ద్వారా నికో ష్లోటర్బెక్ గోల్ చేసి జర్మనీకి మళ్లీ ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత తొలి అర్ధభాగం ముగియడానికి క్షణాల ముందు కై హావెర్ట్జ్ పెనాల్టీని గోల్‌గా మలిచి స్కోరును 3-1కు చేర్చాడు. ఇక రెండో అర్ధభాగంలో జర్మనీ పూర్తిగా గేర్ మార్చేసింది. 53వ నిమిషంలో జమాల్ ముసియాలా గోల్ సాధించగా.. 68వ నిమిషంలో నాథనియెల్ బ్రౌన్ మరో గోల్ అందించడంతో జర్మనీ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన డెనిజ్ ఉండావ్ 78వ నిమిషంలో గోల్ చేయగా.. మ్యాచ్ చివరి దశ 88వ నిమిషంలో కై హావెర్ట్జ్ మరో గోల్ సాధించి తన వ్యక్తిగత ఖాతాలో రెండో గోల్ నమోదు చేసుకున్నాడు. దీంతో జర్మనీ 7-1 భారీ విజయంతో ప్రపంచకప్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.
ఈ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న జర్మనీ తమ తదుపరి మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌ను ఎదుర్కొననుంది. జూన్ 21న టొరొంటో స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు ఐవరీ కోస్ట్ తమ ప్రపంచకప్ ప్రచారాన్ని ఈక్వడార్ తో మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది. జూన్ 15న ఫిలడెల్ఫియాలో జరగనున్న ఈ పోరులో మంచి ఫలితంతో టోర్నమెంట్‌ను ఆరంభించాలని ఆ జట్టు భావిస్తోంది.
Germany Vs Curaçao – All the goals scored
⚽️ Felix Nmecha – 🥾Florian Wirtz
⚽️ Nico Schlotterbeck – 🥾 Nathaniel Brown
⚽️ Kai Havertz – Penalty
⚽️ Jamal Musiala – 🥾 Joshua Kimmich
⚽️ Denis Undav – 🥾 Joshua Kimmich
⚽️ Kai Havertz – Denis Undav⚽️ Livano Comenencia For Curacao… https://t.co/We6pHo6qDo
— The WavyCreator (@wavycreator_) June 14, 2026
తాజావార్తలు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!