Site icon NTV Telugu

Congress : కాంగ్రెస్‌లో కొనసాగుతన్న చేరికల పర్వం..

Congress Symbol

Congress Symbol

హైదరాబాద్ ఉప్పల్ నియోజకర్గంలోని పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ బీజేఆర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మంధముల పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తో కలిసి జమ్మిగద్ద ప్రాంతానికి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

 
Rahul Dravid: భారత ఆటగాళ్లకు నా వీడియోలను చూపించా.. అందుకే సిక్సర్లు బాదుతున్నారు: ద్రవిడ్‌
 

ఈ సందర్భంగా పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 లకే గాస్ పథకాలు విజయవంతంగా అమలు చేశారన్నారు. త్వరలోనే మిగతా గ్యారంటీలు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జనరంజకంగా పాలిస్తున్నారని కితాబిచ్చారు. ఉప్పల్ నియోజకవర్గానికి ఇప్పటికే వందల కోట్లు మంజూరు చేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాటుపడటం అభినందనీయమన్నారు.

 

Exit mobile version