Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Feel Insecure In Resort What Ankita Bhandari Told Her Friend

Ankita Bhandari Case: నన్ను వ్యభిచారిణిగా మార్చేందుకే.. హత్యకు ముందు చాటింగ్‌లో యువతి

Published Date :September 24, 2022 , 8:00 pm
By Mahesh Jakki
Ankita Bhandari Case: నన్ను వ్యభిచారిణిగా మార్చేందుకే.. హత్యకు ముందు చాటింగ్‌లో యువతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ankita Bhandari Case: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అంకితా భండారీ స్నేహితులను పోలీసులు విచారించగా వారు సంచలన విషయాలను బయటపెట్టారు. రిసార్ట్ యజమానితో పాటు కొంతమంది ఉద్యోగులు ఆమెను అతిథులకు ‘ప్రత్యేక సేవలు’ అందించమని కోరేవారని దానికి ఆమె నిరాకరించడం వల్ల వేధింపులకు గురిచేసేవారని వివరించారు. మరోవైపు, అంకిత వాట్సాప్ చాట్ ద్వారా చాలా విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు. అదేవిధంగా రిసార్టుకు చెందిన ఓ ఉద్యోగినితో బాధితురాలు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారింది.

వాట్సాప్‌ చాటింగ్ హత్యకు గురైన యువతి రిసార్టులోని పరిస్థితులను తన స్నేహితురాలికి వివరించింది. వారు తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారని పేర్కొంది. రిసార్టుకు వ‌చ్చే గెస్టుల‌కు ప్ర‌త్యేక సేవ‌లు అందించ‌మంటున్నాడ‌ని, అలా చేస్తే గెస్టుకు రూ.10 వేల చొప్పున పారితోషికం ఇస్తానంటున్నాడ‌ని తెలిపింది. ఈ మెసేజ్‌లను ఆమె స్నేహితురాలు స్క్రీన్ షాట్‌లు తీసి ఆన్‌లైన్‌లో పెట్టింది. ఆ చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. హత్యకు గురైన యువతి తన స్నేహితురాలితో చేసిన వాట్సాప్‌ చాటింగ్ నిందితులు ఆమెను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారనే ఆరోపణలను బలపరిచింది. దీనిపై ఫోరెన్సిక్ విచారణ కూడా జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. అంకిత భండారీ ఏడుస్తూ రిసార్టులోని మరో ఉద్యోగికి చేసిన ఫోన్‌కాల్‌ కూడా వైరల్‌గా మారింది. ఫోన్‌లో ఏడుస్తూనే వేరే ఎవ‌రితోనో త‌న బ్యాగ్‌ను మీద‌కు తీసుకుర‌మ్మని అన్నట్లుగా ఆ ఆడియోలో రికార్డయింది. గెస్టుల కోసం బాధితురాలితో వ్యభిచారం చేయించేందుకు రిసార్టు యజమాని ప్రయ‌త్నించిన‌ట్లు త‌మ విచార‌ణ‌లో తేలింద‌ని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పుల్కిత్ ఆర్య, అతడి సిబ్బంది అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్ కీలక విషయం వెల్లడించారు. సదరు యువతి రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక’ సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆ యువతి తన స్నేహితుడితో జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

Obscene Video: మూడో తరగతి బాలికకు అసభ్యకర వీడియో చూపించిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు

రిసార్టు యజమాని రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావ‌డంతో ఈ ఘ‌ట‌న దేశ‌మంత‌టా సంచ‌ల‌నంగా మారింది. ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఉత్తరాఖండ్‌లోని బీజేపీ స‌ర్కారు నిందితుడిని అరెస్టు చేయించి, శుక్రవారం రాత్రి రిసార్టును ధ్వంసం చేయించింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు బీజేపీ కూడా స్పందించింది. పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి శనివారం సస్పెండ్ చేసింది. అంకిత్ ఆర్య ఉత్తరాఖండ్ ఇతర వెనుకబడిన తరగతుల కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు.ఆ పదవి నుంచి తక్షణమే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలిచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ankita bhandari
  • Ankita Bhandari case
  • resort case
  • uttarakhand
  • Uttarakhand Girl Assassination Case

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions