Fed up with the daughter-in-law mother-in-law filed a complaint with the police: ఇప్పటి వరకు చాలా సందర్భా్ల్లో అత్తల మీద కొత్త కోడళ్లు పోలీసు కేసులు పెట్టడం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే విషయం చాలా డిఫరెంట్. ఐదు నెలల క్రితం పెళ్లై తమ ఇంటికి వచ్చిన కోడలిపైన అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కోడలికి ఉన్న అలవాట్ల కారణంగానే అత్త పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే అత్త కోడళ్ల మధ్య గొడవలు కామన్. ఒకరి మీద మరొకరు చాడీలు చెప్పుకోవడం కూడా సహజమే. అయితే పోలీసుల వరకు వెళ్లి అత్త ఫిర్యాదు చేయడం, అది కూడా ఆమె అలవాట్ల గురించి అంటే కొంచెం తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.
Also Read: Rajasthan: 15 ఏళ్లుగా భర్తను ఆ విషయంలో మోసం చేసిన భార్య.. చివరికి ఏం చేసిందంటే
ఆగ్రాకు చెందిన ఓ మహిళ తన కుమారుడికి ఐదు నెలల క్రితమే పెళ్లి చేసింది. కొత్త కోడలితో ఇంటికి కళ వస్తుంది అని కలలు కంటే ఆమె మాత్రం తన అలవాట్లతో అత్తకి చుక్కలు చూపించింది. కొత్త కోడలు నిత్యం గుట్కాను నములుతూ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతూ ఉండేది. ఈ అలవాటు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన కోడలు అత్త మాటను పట్టించుకోలేదు. అంతేకాదు ఇంటికి ఎవ్వరు వచ్చిన వారేదో తనకు తెలిసిన వారే అన్నట్టు యార్ యార్ అంటూ రాసుకుపూసుకు తిరిగేది. ఈ వ్యవహారం అత్తకు అస్సలు నచ్చలేదు. భర్త చెప్పినా కోడలు వినకపోవడంతో ఇక చేసేది లేక ఆ అత్త పోలీసులను ఆశ్రయించింది. అంతే కాదు తన కోడలు గుట్కా తింటుందని తెలియడానికి ఖాళీ గుట్కా పాకెట్లను కూడా తీసుకువచ్చింది. తన కోడలు అలవాట్లు ఎలాగైనా మాన్పించాలని వారిని వేడుకుంది. దీంతో అత్త బాధను అర్థం చేసుకున్న పోలీసులు అత్తను కోడల్ని కౌన్సిలింగ్ కు పంపించారు. అయితే అక్కడ తాను చేస్తున్నది తప్పే అని ఒప్పుకున్న కోడలు ఒక్క పని మాత్రం చేయడానికి ఒప్పుకోలేదు. ఇంటికి వచ్చిన వారిని యార్ యార్ అని మాట్లాడనని చెప్పిన కోడలు, గుట్కా అయితే మానడం తన వల్ల కాదంది. అయితే మునిపటి లా గుట్కాను ఎక్కడపడితే అక్కడ ఉమ్మనని మాత్రం మాట ఇచ్చింది. అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.