Site icon NTV Telugu

Restrictions On Media: మీడియాపై ఆంక్షలు పెట్టిన ఇజ్రాయెల్.. ఎందుకో తెలుసా..?

Isreal

Isreal

Restrictions On Media: ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెల్‌అవీవ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాతో యుద్ధంలో పాల్గొంటున్న తమ సైనికులు విచారణను ఎదుర్కొనే ఛాన్స్ ఉండటంతో.. మీడియాపై ఆంక్షలు పెట్టింది. ఇటీవల ఇజ్రాయెల్‌కు చెందిన ఓ రిజర్వ్‌ సైనికుడు బ్రెజిల్‌లో పర్యటించాడు. కొందరు పాలస్తీనా అనుూలవాదులు అతడిని గుర్తు పట్టి కంప్లైంట్ చేశారు దీంతో అతడిని విచారించాలని ఫెడరల్ పోలీసులను బ్రెజిల్‌ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం ఆ సైనికుడికి తెలియడంతో బ్రెజిల్ దేశాన్ని విడిచిపెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇకపై తమ సైనికుల పేర్లు, ముఖాలను పూర్తిగా చూపించకూడదని ఇజ్రాయెల్‌ మీడియాకు ఆదేశాలు వెళ్లాయి. కల్నల్‌ అంతకంటే తక్కువ స్థాయి సైనిక అధికారులకు ఈ నిబంధన వర్తిస్తోందని వెల్లడించారు. పైలెట్‌లు, ఇతర విభాగ దళాలకు ఇప్పటికే పలు రూల్స్ అమలు చేస్తున్నారు.

Read Also: Om Birla: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌..

ఇక, మా సైనికుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ వ్యతిరేక వర్గాలు చేస్తున్న ఘటనలతో వారిని రక్షించేందుకు ఈ నిబంనలు ఉపయోగపడతాయని టెల్‌అవీవ్‌ సైనికాధికార ప్రతినిధి నదవ్‌ శోషానీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గ్యాలంట్‌పై ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

Exit mobile version