NTV Telugu Site icon

T20 World Cup 2024: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ ఆటగాడు..

Fazalhaq Farooqui

Fazalhaq Farooqui

గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అఫ్గానిస్థాన్‌ ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ ఫజల్‌హక్‌ ఫరూఖీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ వికెట్ తీసి రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫరూఖీ 2 ఓవర్లలో 11 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఫరూకీకి ఇది 17వ వికెట్.

టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఫజల్‌హక్ ఫరూఖీ నిలిచాడు. ఫరూఖీ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో 16 వికెట్లు తీసిన శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా రికార్డును బద్దలు కొట్టాడు. 2012 టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసిన శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

Emergency: ‘‘ఎమర్జెన్సీ’’పై రాష్ట్రపతి, స్పీకర్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నిరసన..

టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
17* – ఫజల్హాక్ ఫరూకీ (ఆఫ్ఘనిస్తాన్)
16 – వనిందు హసరంగా (శ్రీలంక)
15 – అజంతా మెండిస్ (శ్రీలంక)
15 – వనిందు హసరంగా (శ్రీలంక)
15 – అర్ష్‌దీప్ సింగ్ (ఇండియా)

భారత బౌలర్‌కి సువర్ణావకాశం
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఫజల్‌హాక్ ఫరూఖీ రికార్డును బ్రేక్ చేసే అవకాశమిచ్చింది. మరికొన్ని గంటల్లో ఈ రికార్డు బద్దలు కానుంది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 15 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీస్తే.. ఫరూఖీని వెనక్కి నెట్టి ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.

2024 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
17 – ఫజల్హాక్ ఫరూకీ (ఆఫ్ఘనిస్తాన్)
15 – అర్ష్‌దీప్ సింగ్ (భారతదేశం)
14 – రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్)
14 – రిషద్ హుస్సేన్ (బంగ్లాదేశ్)
13 – నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్తాన్)