Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father-Daughter Bond: పిల్లలపై తమకున్న ప్రేమను బయటకు చెప్పకపోయినా.. తన పిల్లల కోసం.. ఎంత దూరమైనా వెళ్లడానికి.. ఏం చేయడానికైనా వెనుకడుగు వేయడు తండ్రి.. పిల్లలు హ్యాపీగా ఉన్నారు అంటే.. దాని వెనక ఆయన కష్టం ఎంతో ఉంటుంది.. ఇక, తండ్రి-కూతురు మధ్య ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తాజాగా, మిస్ అవుతున్నా నాన్నా అంటూ ఓ కూతురు పెట్టిన మెస్‌కు ఏకంగా 14 గంటలు ప్రయాణం చేసి.. తనకు భరోసా కల్పించిన ఓ తండ్రిపై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఒక్క చిన్న మెసేజ్.. తండ్రి ప్రేమను చాటిచెప్పే అద్భుతమైన సంఘటనకు కారణమైంది. తనను మిస్ అవుతున్నానని కూతురు మెసేజ్ చేయడంతో, ఆ తండ్రి మరుసటి రోజే ఆమెను కలిసేందుకు ఏకంగా 14 గంటలు ప్రయాణించి వచ్చాడు. కొద్దిసేపు కూతురితో గడిపి తిరిగి మరో 14 గంటలు ప్రయాణం చేసిన ఈ తండ్రి ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తలుపు తీస్తే ఎదురుగా నాన్న
ఇన్‌స్టాగ్రామ్‌లో @apple.kaivalya అనే యువతి తన తండ్రితో జరిగిన ఈ భావోద్వేగ ఘటనను వీడియో ద్వారా పంచుకుంది. ముందు రోజు రాత్రి తన తండ్రికి తాను ఆయనను గుర్తు చేసుకుంటున్నానని, మిస్ అవుతున్నానని మెసేజ్ చేసినట్లు తెలిపింది. అయితే మరుసటి రోజు ఉదయం తలుపు తెరిచినప్పుడు ఎదురుగా బ్యాక్‌ప్యాక్‌తో తన తండ్రి నిలబడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
Also Read
- US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
- 8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
- Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
14 గంటలు ప్రయాణించి.. 8 గంటలు కూతురితో
తనను కలిసేందుకు తండ్రి 14 గంటలు ప్రయాణించి, తనతో సుమారు 8 గంటలు గడిపి, తిరిగి మరో 14 గంటలు ప్రయాణించారని ఆమె చెప్పింది. అంతేకాదు, తన తండ్రి బిజీగా ఉన్న పని కాల్స్‌ను కూడా మధ్యలోనే చూసుకున్నారని తెలిపింది. కూతురితో గడిపిన ఆ కొద్దిసమయంలోనూ తండ్రి ఆమెకు ఎంతో ప్రేమగా సమయం కేటాయించారు. ఇంట్లోని పాత్రలను స్వయంగా శుభ్రం చేశారు. కూతురిని బయటకు తీసుకెళ్లారు. ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా తినిపించారు.
‘నేను ఎప్పుడూ నీతోనే ఉన్నా’
తిరిగి వెళ్లే ముందు తండ్రి తన కూతురిని సంతోషంగా ఉండాలని చెప్పడంతో పాటు, తాను ఎప్పుడూ ఆమెకు తోడుగా ఉంటానని గుర్తు చేశారు. తాను రమ్మని అడగకపోయినా, తండ్రి స్వయంగా వచ్చారని యువతి తెలిపింది. తాను ఎప్పుడూ ఒంటరిగా లేనని గుర్తు చేయడానికే తన తండ్రి వచ్చారని ఆమె భావోద్వేగంగా చెప్పింది. తాను తండ్రిని చూడాలని కోరుకున్నానని, వెంటనే ఆయన వచ్చారని పేర్కొంది. ఒక రోజు తనతో గడుపుతూ తాను అడగకుండానే ఎన్నో చిన్న చిన్న పనులు చేశారని తెలిపింది.
‘తల్లిదండ్రులు మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తారు’
తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘మేము ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాం’ అని ప్రతిసారీ మాటల్లో చెప్పకపోవచ్చని ఆమె పేర్కొంది. కానీ అవసరమైన సమయంలో వాళ్లు అండగా నిలబడటం ద్వారా తమ ప్రేమను తెలియజేస్తారని తెలిపింది. అలాంటి సందర్భాలే పిల్లలు ఎప్పుడూ ఒంటరిగా లేరని గుర్తు చేస్తాయని చెప్పింది.
తండ్రి ప్రేమకు నెటిజన్ల స్పందన
ఈ భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. తండ్రి చేసిన పనిని చూసి చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. “అదే నాన్నంటే నాన్నే!” అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. మరో వ్యక్తి తన 11వ తరగతిలో ఉన్నప్పుడు తన తండ్రి కూడా ఇలాగే చేశారని గుర్తు చేసుకున్నారు. మరో నెటిజన్ “మీరు నన్ను ఇప్పుడే ఎమోషనల్ చేస్తున్నారు” అంటూ స్పందించారు. మాటల్లో చెప్పలేని తల్లిదండ్రుల ప్రేమను ఒక్క చర్యతో చూపించిన ఈ తండ్రి కథ సోషల్ మీడియాలో ఎంతోమందిని కదిలిస్తోంది.
తాజావార్తలు
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్