Site icon NTV Telugu

Shameful Incident: సమాజం ఎటు వెళ్తుంది.. కూతురిపై కన్న తండ్రి అత్యాచారం

Ayodhyagangrape

Ayodhyagangrape

సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కామాంధులు వావివరుసలు కూడా చూడటం లేదు. కన్న కూతుర్లపై కూడా అత్యాచారానికి ఒడిగడుతున్నారు. తాజాగా.. యూపీలోని రాయ్‌బరేలీలో అలాంటి ఘటన వెలుగు చూసింది. ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు గ్రామస్తులకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Read Also: Rahul Gandhi: “నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు..

ఈ కేసు బచ్రావాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కన్న తండ్రి తన ఏడేళ్ల కూతురిని తన కామ కోరికలకు బలి చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. బాలిక ఇంట్లో నిద్రపోతుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే.. నాలుగు రోజుల క్రితం తల్లి చుట్టాలింటికి వెళ్లింది. ఇంట్లో మరెవరూ లేరు. ఈ క్రమంలో.. కూతురిని ఒంటరిగా ఉందని తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం బాధితురాలు గ్రామస్తులకు చెప్పింది. బాలిక మాటలు విని ఆగ్రహించిన గ్రామస్తులు తండ్రిని కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ హెడ్ ఓంప్రకాష్ తివారీ మాట్లాడుతూ.. నిందితుడు తండ్రిపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: Thailand: థాయ్‌లాండ్‌ ప్రధానిపై వేటు.. కోర్టు యాక్షన్‌తో ఊడిన పోస్టు

Exit mobile version