NTV Telugu Site icon

Father Son: ఏంటి భయ్యా ఈ కుక్క గోల.. కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తండ్రి.. చివరకి..

Dog Died

Dog Died

మానవులకు విధేయత చూపే జంతువులు కుక్కలు మాత్రమే. కుక్కల పట్ల యజమానులకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. చాలా మంది తమ కుక్కలను కుటుంబంలోని మనిషిలా చూస్తారు. వాటికి ఏదైనా అయితే మాత్రం తెగ బాధపడి పోతారు. ఇకపోతే ఓ వ్యక్తి తాజాగా చచ్చిపోయిన కుక్కను ఎత్తుకుని పోలీస్ స్టేషన్ గేటు వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చెప్పిన మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఛత్తీస్‌గఢ్‌ లో జరిగిన ఈ ఘటన వివరాలను ఓసారి పరిశీలిస్తే..

Also Read: Swallowing LED Bulb: ప్రమాదవశాత్తూ ఎల్‌ఈడీ బల్బు మింగిన బాలుడు.. చివరకు..

ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సూరజ్‌పూర్ జిల్లాలోని పూడి గ్రామానికి చెందిన శివమంగల్ సాయి అనే వ్యక్తి తన కుక్క మరణించగా దాని కళేబరాన్ని తీసుకోని పోలీస్ స్టేషన్‌ కు వెళ్ళాడు. తన కొడుకే ఈ కుక్కను చంపినట్లుగా అతను పోలీసులకు తెలిపాడు. శివమంగల్ చాలా ఏళ్లుగా కుక్కను పెంచుకుంటున్నాడు. ఇక మరోవైపు ఆయనకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే తన కుమారులు ఎవరికీ కుక్కలంటే ఇష్టం లేదని., ఇటీవల తన కుమారుడు సంత్‌‌ధారి బయటకు వెళ్తుండగా కుక్కను చంపేశాడని ఆరోపించాడు. దాంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Job Seeker: ఉద్యోగం కోసం కంపెనీ యాజమాన్యానికే ఆఫర్ ఇచ్చిన నిరుద్యోగి.. పోస్ట్ వైరల్..

అయితే కుక్క తన తల్లిపై దాడి చేస్తుందనే భయంతో దానిని చంపాల్సి వచ్చిందని సంత్‌‌ధారి తెలిపాడు. అయితే శివమంగల్ తన కుమారుడి వాదనను తోసిపుచ్చాడు. తన కుక్క ఎవరిపైనా దాడి చేయలేదని చెబుతూ., తాను ఇంట్లో లేని సమయంలో కుమారుడు సంత్‌‌ధారి ఈ ఘటనకు వడిగాటినట్లు తెలిపాడు. కుక్కను బంతి తీసుకురమ్మనాడని, అది మాట వినకపోవడంతో పదునైన ఆయుధంతో కుక్కను పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. దాంతో అతని పై సెక్షన్ 429 కింద కేసు నమోదు చేయగా., తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.