Telangana: కోడలు అకాల మరణాన్ని తట్టుకోలేక ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. తలోడి గ్రామానికి చెందిన జాడి జూలాజీ(75) తన కోడలు లలిత మరణవార్త విని కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.
Husband Cheating: ఘరానా మొగుడు.. ఇద్దరితో పెళ్లి, మరొకరితో ప్రేమాయణం
జూలాజీ పెద్ద కుమారుడు గోప్లా భార్య లలిత (30)కు కాగజ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో కాన్పు కావడంతో శస్త్ర చికిత్స చేయించుకుంది. మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాలలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచింది. ఈ వార్త విన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మామాకోడళ్ల మృతితో తలోడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.