NTV Telugu Site icon

Viral Video : ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉండాలి.. కూతురంటే ఎంత ప్రేమో

Daughter

Daughter

తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు.

Also Read: ITR Refund: లక్షల మంది అందని ఐటీఆర్ రీఫండ్.. ఆలస్యం అయితే ఫైన్ కట్టాల్సిందే

డ్యూటీకి వెళ్లేందుకు మేకప్ వేసుకుంటూ రెడీ అవుతున్న ఓ కూతరికి తన తండ్రి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. దీనిని పూజా బిహానీ శర్మ అనే యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. పూజా బిహానీ ఇండిగోలో కంటెంట్ క్రియేటర్, లీడ్ క్యాబిన్ అటెండెంట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు తన తండ్రితో అనుబంధాన్ని తెలిపే విధంగా ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతూ ఉండగా ఆమె తండ్రి ఆమెకు ప్రేమగా గోరు ముద్దులు తినిపిస్తున్నాడు. ఈ వీడియోను షేర్ చేసిన పూజా నాన్న.. ‘ఇప్పటి వరకు ఎప్పుడు దీని గురించి నేను చెప్పలేదు. ఈ రోజు కచ్ఛితంగా ఎక్కువే చెబుతాను. నువ్వు ఇప్పటి వరుకు చేసిన ప్రతిదానికి థ్యాంక్స్ నాన్న. నువ్వు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు. ఐ లవ్ యూ పాపా’అని రాసుకొచ్చింది. ఈ వీడియో అందరి మనసులకు హత్తుకుంటుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు పూజా నువ్వు చాలా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా చాల మంది తమ తల్లిదండ్రులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తండ్రి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఒక తండ్రి మాత్రమే తన కూతురు కోసం ఇలా చేయగలడు అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఇలా తండ్రి  ప్రతి ఒక్కరికీ ఉండాలి అని అంటున్నారు. మరి కొంతమంది ఈ సందర్భంగా వారికి తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు. తమ అమ్మ ఇలాగే తనుకు గోరు ముద్దలు తినిపిస్తుందని ఓ యూజర్ పేర్కొన్నారు.