NTV Telugu Site icon

Divorce Celebration: అచ్చు పెళ్లి బరాత్‌ మాదిరే.. కూతురుకి విడాకుల ఊరేగింపు చేసిన తండ్రి!

Father Daughter Love

Father Daughter Love

Father brought back Daughter to home with band baaja baaraat form her in-laws house: సాధారణంగా ఏ తండ్రైనా తన కుమార్తె అత్తింట్లో కష్టాలు పడుతుంటే చూడలేక చాలా బాధపడుతుంటాడు. ఇక కుమార్తె విడాకులు తీసుకుంటానంటే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అయితే అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసిన ఓ తండ్రి.. తన కూతురికి ఘన స్వాగతం పలికాడు. అచ్చం పెళ్లి బరాత్‌ మాదిరే.. భాజాభజంత్రీలు, బాణసంచా సందడి మధ్య అత్తింటి నుంచి పుట్టింటికి భారీ ఊరేగింపుగా తీసుకొచ్చాడు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…

రాంచీలోని కైలాశ్​నగర్ కుమ్​హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తికి కుమార్తె సాక్షి గుప్తా ఉంది. 2022 ఏప్రిల్ 28న రాంచీలోని సర్వేశ్వరి నగర్​కు చెందిన సచిన్ కుమార్ అనే వ్యక్తితో కుమార్తె వివాహం ఘనంగా చేశాడు. ఝార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్​గా సచిన్ పనిచేస్తున్నాడు. వివాహం అయిన కొన్ని రోజులకే సచిన్ తన భార్య సాక్షిని వేధింపులకు గురిచేశాడు. కొన్నిసార్లు కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేవాడు. సచిన్ తల్లిదండ్రులు ఏమీ అనక పోగా.. తన కుమారుడికి సపోర్ట్ చేశేవారు.

సచిన్‌కు అంతకు ముందే వివాహం అయినట్లు కొద్దినెలల క్రితమే తెలిసినా.. అతడితో వివాహ బంధం కొనసాగించాలనే సాక్షి తొలుత నిర్ణయించుకుంది. కానీ వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండలేనని సాక్షి నిర్ణయించుకుంది. తన వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలనుకుంటున్నాని సాక్షి తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు స్వాగతించారు. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రేమ్ గుప్తా ఘనంగా ఏర్పాట్లు చేశారు. భాజాభజంత్రీలు, టపాసులు కాలుస్తూ ఆమెకు పుట్టింటికి స్వాగతం పలికారు.

Also Read: Rohit Sharma Bowling: బంతి పట్టిన రోహిత్ శర్మ.. బంగ్లాకు చుక్కలు తప్పవా?

తన కుమార్తె వేధింపుల నుంచి విముక్తి పొందిందని, ఆ ఆనందంతోనే ఇలా ఇంటికి తీసుకొని వచ్చినట్లు సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా తెలిపారు. కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇక సచిన్‌తో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో సాక్షి కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. భాజాభజంత్రీలు, బాణసంచా సందడికి తీసుకొచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Show comments