తమ పిల్లల ఇష్టాలు తీర్చడానికి పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాళ్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని అనుకుంటారు. కూతురి స్కూల్ ఈవెంట్ లో వీల్ చైర్ లో ఉండి కూతురితో డ్యాన్స్ చేశాడు ఓ తండ్రి.. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also : Christopher Nolan: క్రిస్టఫర్ నోలాన్ ఈ సారి ఏం చేయనున్నాడు!?
చార్లెస్ పాటర్ అనే వ్యక్తి 2006లో యూఎస్ లోని వర్జీనియాలో ఓ తాగుబోతు డ్రైవర్ తో గొడవ పడ్డాడు. ఆ సంఘటనలో డ్రైవర్ చార్లెస్ ను కొట్టడంతో తీవ్ర గాయాల పాలై చార్లెన్ వీల్ ఛైర్ కి పరిమితం అయ్యాడు. ఈ ఇన్సెడెంట్ తరువాత ఎటువంటి కదిలికలు లేకుండా పోయిన తన శరీరాన్ని మరలా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చార్లెస్ చాలా కష్టపడ్డాడు. దీంతో రీసెంట్ గా చార్లెస్ పాటర్ ఆరు సంవత్సరాల కూతురు చదువుతున్న స్కూల్ లో ఓ ఈవెంట్ జరిగింది.
Read Also : Swetha Death Case Mystery: శ్వేత కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయం..!
ఈ ఈవెంట్ లో ఆమె క్లాస్ మేట్స్ తో వాళ్ల తండ్రులు కలిసి డ్యాన్స్ చేశారు.. చార్లెస్ కూడా స్టేజ్ మీద వీల్ ఛైర్ మీద కూర్చుని కూతురితో స్టెప్పులు వేయించాడు. ఈ వీడియో అందరి మనస్సుల్ని హత్తుకుంది. కంటనీరు తెప్పిస్తుంది. అందరు అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నారు. కూతురి కోసం అతను చూపించిన ప్రేమకు ఫిదా అవుతున్నారు.
Read Also : Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు జ్యుడిషియల్ రిమాండ్ పొడగింపు..
స్కూల్ సిబ్బంది పంపిన వీడియోని చూసి తండ్రీ కూతుళ్లిద్దరూ ఈ డ్యాన్స్ మూమెంట్స్ నేర్చుకున్నారట. అందుకోసం 4 రోజుల సమయం మాత్రమే పట్టిందట. కూతురి ఆనందమే తన ఆనందంగా భావించి తన శరీరం సహకరించపోయినా పాటర్ ఎంత గొప్పగా డ్యాన్స్ చేయించాడో చూశారుగా.. అందుకే చార్లెస్ పాటర్ నిజంగానే గ్రేట్ ఫాదర్.