Cruel Father: బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రూ.10కోసం ఆరేళ్ల బాలికను తండ్రి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లాలోని పటోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామోన్ గ్రామంలో చోటుచేసుకుంది. తండ్రి కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. మంతూ రాయ్ అసన్ హ్యాండ్‌కార్ట్ నడుపుతూ జీవిస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే ఇంట్లో బాలిక కనిపించడం లేదు.. దీంతో ఎక్కడికి వెళ్లావు అంటూ బాలికను తీవ్రంగా కొట్టాడు. దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Whatsapp: గర్భిణీకి పురిటి నొప్పులు.. వాట్సాప్ సాయంతో డెలివరీ
వివరాల్లోకి వెళితే.. మంతూ రాయ్ పని మీద చాలా కాలం బయటికి వెళ్లేవాడు. దీంతో బాలిక రాత్రిళ్లు భయంతో నిద్రించేందుకు వేరే ప్రాంతానికి వెళ్లేది. ఈ విషయంపై తరచుగా చిన్నారిపై తండ్రి కోపగించుకునే వాడు. ఇటీవల బాలిక తండ్రి లేని సమయంలో ఇంట్లో రూ.10తీసుకుని ఆ డబ్బుతో బిస్కెట్లు కొని తిన్నది. కోపంతో మంతూ రాయ్ బాలికను కొట్టాడు. దీంతో బాలిక శరీరంపై తీవ్రగాయాలయ్యాయి. కాలు కూడా విరిగింది.
Read Also: Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి
తండ్రి కొట్టడంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. దీంతో తండ్రి బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఆమెను సమస్తిపూర్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక అక్కడే చికిత్స పొందుతోంది. తన తల్లిని కూడా తన తండ్రి తరచూ కొట్టేవాడని గాయపడిన బాలిక తెలిపింది. దీంతో విసిగిపోయిన ఆమె తల్లి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తండ్రి దారుణంగా కొట్టాడు. అందుకే ఆ బాలిక భయపడిపోయి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. కనికరం లేని తండ్రిని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తోంది.