లోకంలో ఏ తండ్రికైనా తన కూతురు మహరాణి అనడంలో సందేహం లేదు. కూతురే ప్రాణంగా జీవించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. తమ బిడ్డ భవిష్యత్తుకోసం వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. బాగా చదివించాలని, బిడ్డల పెళ్లి కోసమని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కొంతమంది కూతుర్లు ప్రేమ మాయలో పడి పేరెంట్స్ గుండెల మీద తన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. తాను ప్రేమించిన ప్రియుడికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ యువతి తను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతోంది. ఇది తెలిసిన ఆమె తండ్రి వెంబడించి ప్రియుడితో వెళ్లొద్దని కాళ్ల మీదపడి ప్రాధేయపడినా కనికరం లేకుండా ఆ కూతురు వెళ్లిపోయింది. గుండెలు పిండేసే ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Nikhil : ఆ రెండు పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటంటే..?
ఇటీవల కాలంలో తమ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని, వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తుందని హత్యలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. సమాజంలో కుటుంబ పరువుపోతుందని భావించి కుమార్తెలను అంతమొందిస్తున్నారు. పరువు హత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే తమిళనాడులో తాజాగా జరిగిన ఘటన ఇందుకు భిన్నం. కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి. కూతురు ఆ యువకుడిపై ఎలాంటి ధాడికి పాల్పడకుండా ప్రేమతో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
Also Read:Karnataka: సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలలో లైంగిక విద్య ప్రవేశపెట్టాలని నిర్ణయం
ప్రియుడితో వెళ్లొద్దని.. ఇంటికి రమ్మని కూతురును కోరాడు. తన కూతురును వదిలేయమని ఆ యువకుడి కాళ్లపై పడ్డాడు. దణ్ణం పెట్టిమరీ వేడుకున్నాడు. తండ్రి అల్లాడిపోతున్నా ఆ కూతురు మనసు కరగలేదు. తను ప్రేమించిన యువకుడితో వెళ్లేందుకే సిద్ధపడింది. తమను వదిలేయాలని తండ్రి కాళ్లకు దణ్ణం పెట్టింది. అయితే నెట్టింటా వైరల్ గా మారిన ఈ వీడియో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు ఇది నిజంలా లేదు రీల్స్ కోసం చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.