Pakistan : సంసార సుఖం కోసం బల్లి నుంచి ఆయిల్.. ఎగబడి కొంటున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్తాన్లో వయాగ్రాపై నిషేధం విధించారు. ప్రస్తుతం ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితిలో అక్కడ ఓ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సంసార సుఖంలో సంతోషం లేని వారే ఈ వ్యాపారానికి ప్రధాన కస్టమర్లు. వారి నిస్సాహయత వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. బల్లి యొక్క కొవ్వును సంగ్రహించి, తేలు నూనెతో వేడి చేయడం ద్వారా సెక్స్ పవర్ పెంచే నూనెను తయారు చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని ప్రజలు దీనిని ‘సందే కా టెల్’ అని పిలుస్తారు.
సమాచారం ప్రకారం.. ఈ నూనెను ఎడారి ప్రాంతాల్లో కనిపించే బల్లుల కొవ్వు నుండి తయారు చేస్తారు. ఈ నూనె శాస్త్రీయంగా ప్రభావవంతంగా పని చేస్తుందో తెలుసుకునేందుకు రుజువులు లేవు. ఇస్లామాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ సాహబ్ దానిని అర్ధంలేనిదిగా పేర్కొన్నాడు. కానీ పాకిస్థాన్‌లో మాత్రం దీనిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఏ రోడ్డు పక్కన చూసిన వ్యాపారులు కూర్చొని ఈ నూనెను విక్రయిస్తున్నారు. ఈ వ్యక్తులు పంజాబ్, సింధ్ ప్రావిన్స్ నుండి అక్రమంగా వేటాడి బల్లులను తీసుకువస్తారు. సాధారణ బల్లుల కంటే దీని పరిమాణం పెద్దది (2 అడుగుల వరకు)గా ఉంటుంది. రాత్రిళ్లు వలలతో బల్లులను వేటాడుతున్నారు. పట్టుబడితే పారిపోకుండా వాటి వీపును కిరాతకంగా విరగ్గొట్టుతారు. తర్వాత వీటిని ఎగ్జిబిషన్ లాగా వీధుల్లో ప్రదర్శించి కస్టమర్లను ఆకర్షిస్తారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Read Also:Chennai Customs : దీని దుంప తెగ.. లగేజీ నిండా భయంకరమైన పాములు
చమురు తయారీదారులు ఈ బల్లులను కోసి వాటి తోక కింద నుండి ఒక గ్రంధిని బయటకు తీస్తారు. దీని తర్వాత అది ఒక చిన్న పాన్‌లో వేడి చేస్తారు. అదే తర్వాత కస్టమర్‌కు ఇవ్వబడుతుంది. ఈ నూనె లైంగిక శక్తిని అమాంతంగా పెంచుతుందని నమ్మకం. కేవలం నాలుగు చుక్కలు వాడితే చాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నూనె అమ్మకందారు యాసిన్ అలీ తెలిపారు. లైంగిక శక్తిని పెంచడంలో ఈ ఆయిల్ మ్యాజిక్ లా పనిచేస్తుంది. వ్యాపారులు దానిని సీసాలలో నింపి కస్టమర్లకు విక్రయిస్తారు. డిమాండ్‌పై ఇస్తారు. దీని ధర 600 నుండి 1200 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణయించబడింది.
ఈ నూనె లైంగిక శక్తిని పెంచడమే కాకుండా కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, జుట్టు రాలడాన్ని నివారిస్తుందని ఈ నూనె విక్రయదారులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్‌లో ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారిని పోలీసులు చాలాసార్లు పట్టుకున్నారు. కానీ 10,000 జరిమానా కట్టి విడుదలయ్యారు. వారు మళ్లీ బల్లులను తీసుకురావడం ద్వారా తమ వ్యాపారం చేయడం ప్రారంభించారు.
Read Also:Cable railway bridge : దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!