NTV Telugu Site icon

Farzi : మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ గా నిలిచిన ఫర్జి..

Whatsapp Image 2023 11 16 At 11.21.01 Am

Whatsapp Image 2023 11 16 At 11.21.01 Am

ఓటీటీ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంతగానో ఇష్టపడుతున్నారు… సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు ఇండియాలో అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు.ఇంగ్లిష్ వెబ్ సిరీస్ లు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నా కానీ హిందీ, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో ఇవి రావడం కొన్నేళ్ల కిందటే మొదలైంది.అయితే ఇండియన్ ప్రేక్షకులు చాలా త్వరగానే ఈ వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. వాటిని ఎంతగానో ఆదరించారు. మరి ఈ దశాబ్ద కాలంలో రిలీజైన వెబ్ సిరీస్ లలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఏదనేది ఆర్మాక్స్ మీడియా సమాధానమిచ్చింది. ఈ సంస్థ రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఫర్జీ..ఫర్జీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల అయింది… బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరియు రాశీ ఖన్నా వంటి స్టార్స్ నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ను ఇప్పటి వరకూ ఏకంగా 3.71 కోట్ల మంది చూసినట్లు ఆర్మాక్స్ మీడియా రిపోర్టు వెల్లడించింది.

గతేడాది జనవరి నుంచి వెబ్ సిరీస్ డేటాను ఈ సంస్థ విశ్లేషిస్తోంది. ఫర్జీ వెబ్ సిరీస్ తర్వాత రెండవ స్థానం లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వచ్చిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ నిలిచింది.. ఈ సిరీస్ ను ఇప్పటి వరకూ 3.52 కోట్ల మంది చూశారు. మూడో స్థానంలో హాట్‌స్టార్ లోనే వచ్చిన ది నైట్ మేనేజర్ ఉంది. ఈ సిరీస్ ఇప్పటి వరకూ 2.86 కోట్ల వ్యూస్ సంపాదించిందిఫర్జీ వెబ్ సిరీస్ దొంగ నోట్ల చుట్టూ తిరిగే కథ. ప్రముఖ తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 8 ఎపిసోడ్ల గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా మెప్పించింది.. ఓ ఆర్టిస్ట్ డబ్బులు సంపాదించడానికి తన కళనే ఉపయోగించి దొంగ నోట్ల బిజినెస్ లోకి ఎలా వస్తాడు అనేది ఈ ఫర్జీ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీ ఏకంగా 8.4 రేటింగ్ ను ఇచ్చింది.