Farzi : మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ గా నిలిచిన ఫర్జి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంతగానో ఇష్టపడుతున్నారు… సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు ఇండియాలో అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు.ఇంగ్లిష్ వెబ్ సిరీస్ లు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నా కానీ హిందీ, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో ఇవి రావడం కొన్నేళ్ల కిందటే మొదలైంది.అయితే ఇండియన్ ప్రేక్షకులు చాలా త్వరగానే ఈ వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. వాటిని ఎంతగానో ఆదరించారు. మరి ఈ దశాబ్ద కాలంలో రిలీజైన వెబ్ సిరీస్ లలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఏదనేది ఆర్మాక్స్ మీడియా సమాధానమిచ్చింది. ఈ సంస్థ రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఫర్జీ..ఫర్జీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల అయింది… బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరియు రాశీ ఖన్నా వంటి స్టార్స్ నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ను ఇప్పటి వరకూ ఏకంగా 3.71 కోట్ల మంది చూసినట్లు ఆర్మాక్స్ మీడియా రిపోర్టు వెల్లడించింది.
గతేడాది జనవరి నుంచి వెబ్ సిరీస్ డేటాను ఈ సంస్థ విశ్లేషిస్తోంది. ఫర్జీ వెబ్ సిరీస్ తర్వాత రెండవ స్థానం లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వచ్చిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ నిలిచింది.. ఈ సిరీస్ ను ఇప్పటి వరకూ 3.52 కోట్ల మంది చూశారు. మూడో స్థానంలో హాట్‌స్టార్ లోనే వచ్చిన ది నైట్ మేనేజర్ ఉంది. ఈ సిరీస్ ఇప్పటి వరకూ 2.86 కోట్ల వ్యూస్ సంపాదించిందిఫర్జీ వెబ్ సిరీస్ దొంగ నోట్ల చుట్టూ తిరిగే కథ. ప్రముఖ తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 8 ఎపిసోడ్ల గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా మెప్పించింది.. ఓ ఆర్టిస్ట్ డబ్బులు సంపాదించడానికి తన కళనే ఉపయోగించి దొంగ నోట్ల బిజినెస్ లోకి ఎలా వస్తాడు అనేది ఈ ఫర్జీ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీ ఏకంగా 8.4 రేటింగ్ ను ఇచ్చింది.
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!