NTV Telugu Site icon

Farooq Abdullah: పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటే.. పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..

Abdulla

Abdulla

IND vs PAK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)ను భారత్‌లో విలీనం చేస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్‌ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు. పాకిస్థాన్ దేశం ఏం గాజులు తొడుక్కుని లేదు.. ఆ దేశం దగ్గర అణు బాంబులు ఉన్నాయి.. పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని ఆయన కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ మన మీద అణు బాంబులు పడితే ఏంటి పరిస్థితి? అంటూ ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు.

Read Also: ED Raids: రాంచీలో ఈడీ దాడులు.. మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో భారీగా నగదు

కాగా, భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత రోజు ఫరూఖ్ అబ్దుల్లా ఈ కామెంట్స్ చేశారు. కేంద్ర రక్షణ మంత్రి చెప్తున్నట్టు అలాగే చేయాలనుకుంటే ముందుకు వెళ్లాలి.. ఆపేందుకు తామెవరిమని అంటూ ప్రశ్నించారు. కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారత్‌లో తాము భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ అన్నారు. ప్రజలు తమంతట తాము భారత్‌లో భాగం కావాలనుకుంటున్నారు.. కాబట్టే పీఓకేను బలవంతంగా భారత్‌లో కలపాల్సిన అవసరం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు.