Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Farmers Protest 2024 High Alert Delhi Border

Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం.. పోలీసుల పటిష్ట భద్రత

Published Date :February 21, 2024 , 11:08 am
By Chandra Shekhar Pamena
Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం.. పోలీసుల పటిష్ట భద్రత
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు. శాంతియుతంగా దేశ రాజధానికి పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు.. రైతులను అడ్డుకునేందుకు మూడు అంచెల వ్యవస్థతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: Bharat Jodo Yatra: రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు తాత్కాలిక విరామం!

ఇక, కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నాలుగు సార్లు చర్చలు చేసింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర సర్కార్ ప్రతిపాదించింది. అయితే, అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. దీంతో చర్చలు విఫలం కావడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఇక, ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ – హర్యానా సరిహద్దు దగ్గర రైతులను పోలీసులు నిలువరిస్తున్నారు. ఒకవైపు సిమెంట్‌ కాంక్రీట్‌ దిమ్మెలతో పాటు ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also: Stock Market Opening: చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్.. తొలిసారిగా 22,248కి చేరిన నిఫ్టి

అలాగే, తొలి రోజు జరిగిన పరిస్థులను దృష్ట్యిలో పెట్టుకున్న రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెలను బద్దలు కొట్టేందుకు జేసీబీలు, వాటిని నడిపేవాళ్లపై టియర్‌ గ్యాస్‌ ప్రభావం పడకుండా ప్రత్యేక ఇనుప కవచాలు, జనపనార బస్తాలతో రైతులూ సిద్ధమయ్యారు. శంభు సరిహద్దు దగ్గర 1,200 ట్రాక్టర్లు, 14 వేల మంది రైతులు మోహరించినట్లు కేంద్ర హోంశాఖ నివేదికలో తెలిపింది. తక్షణమే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు కూడా నల్ల జెండాలతో ఆందోళన చేయాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఇక, పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్‌కేఎమ్‌ ఇప్పటికే వెల్లడించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi
  • Farmers Protest
  • high alert
  • latest news
  • police

తాజావార్తలు

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions