Tomato Price: టమాటా రైతన్నల కంట కన్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరుగాలం శ్రమించి పండించి మార్కెట్‌కు తరలిస్తే ఇక్కడి వ్యాపారుల మాయాజాలంతో టమాటా రైతులు నిలువునా మునిగిపోతున్నారు. దీంతో టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పత్తికొండ మార్కెట్ యార్డు బయట పత్తికొండ-గుత్తి ప్రధాన రహదారిపై జనసేన-బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. ఇక, జనసేన-బీజేపీ నిరసనతో రెండు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మార్కెట్‌యార్డు సిబ్బంది సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ధరల స్థిరీకరణకు కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
Read Also: IPO Next Week: ఇన్వెస్టర్స్ గెట్ రెడీ.. ఈ వారం 16 కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయ్
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమోటా 2 రూపాయలకు మించి అమ్ముడు పోవడం లేదని.. దీంతో పెట్టుబడుల మాట అటుంచి కోత కూలీలు, రవాణ చార్జీలు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. కిలో టమోటాను రూ.20 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టమోటా పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్‌లో ధర పతనమై తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయాల్లో ఆయా పార్టీలు హామీలు ఇవ్వడం.. ఆ తరువాత మరిచిపోవడం మామూలైపోయిందన్నారు. ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి టమోటా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పత్తికొండ మార్కెట్ లో కిలో టమాటా ధర కేవలం రూ. 50 పైసలు పలుకుతుంది. దీంతో తమకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!