NTV Telugu Site icon

Girl Friend: మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిందని.. ప్రియురాలిని హోటల్‌కి పిలిచి ఏం చేశాడంటే?

Haryana

Haryana

Man Strangles Girl Friend: తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిందని ఆమెను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ దారుణ ఘటన హర్యానాలో ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో 24 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌హెచ్‌పీసీ చౌక్ పరిసరాల్లోని ఓయో హోటల్‌ లైమ్‌స్టోన్‌లోని గదిలో ఒక యువతి అనుమానాస్పదంగా మరణించినట్లు సమాచారం అందిందని సెక్టార్ 31 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ తెలిపారు. పోలీసు బృందంతో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ఆ హోటల్ గదిలో మహిళ మృతదేహాన్ని కనుగొన్నామని వీరేంద్ర సింగ్ చెప్పారు.

Also Read: Bengaluru: 8 ఏళ్ల బాలిక అబద్ధం.. ఫుడ్ డెలివరీ బాయ్‌ని చితకబాదిన వైనం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆకాశ్ అనే యువకుడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు ఉంది. గత ఏడేళ్ల నుంచి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆమె గత కొన్ని రోజుల మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆకాశ్ అనుమానం పెంచుకున్నాడు. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 31 పోలీస్ స్టేషన్‌లో పరిధిలో లైమ్‌స్టోన్ హోటల్‌కు రమ్మని ప్రియురాలుకు ఆకాశ్ కబురు పంపాడు. ప్రియురాలు మరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. తన ప్రియురాలి మెడకు తాడు చుట్టి హత్య చేశాడు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆకాశ్ హత్య చేసినట్టుగా ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.