NTV Telugu Site icon

IPL 2024: ఆర్సీబీ గెలువాలని ఫ్యాన్స్ పూజలు..

Rcb Fans

Rcb Fans

చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కాసేపట్లో బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్ అయినప్పటికీ ప్లేఆఫ్స్ కారణంగా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అయితే బెంగళూరు మాత్రం 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో ఛేజింగ్ చేసి గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే.. బెంగళూరు అభిమానులు మాత్రం తమ జట్టు ఎలాగైనా ప్లే ఆఫ్స్ కు చేరాలంటూ పూజలు నిర్వహించారు. బెంగళూరులోని చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సీఎస్కేకు బైబై. జై ఆర్సీబీ. కప్ నమ్దే అంటూ.. ఆలయంలో వారు నినాదాలు చేశారు. చెన్నైపై విజయం సాధించాలంటూ.. తమ జట్టుకు, విరాట్ కోహ్లీకి కొబ్బరికాయలు కూడా కొట్టారు.

Gas Cylinder Blast: పంజాబ్లో గ్యాస్ పేలుడు.. ఏడుగురికి తీవ్ర గాయాలు

కాగా.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఆరంభంలోనే వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఆర్సీబీ.. చివర్లో అన్నీ మ్యాచ్ ల్లో గెలుచుకుంటూ వచ్చింది. అయితే.. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్తామని ఆర్సీబీ అంటోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తరుఫున విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి బ్యాట్స్‌మెన్లు అద్భుత ప్రదర్శన చూపించాలి. బౌలర్లలో సిరాజ్ పుంజుకోవాలి. అలా అయితేనే చెన్నైపై గెలుపొందే అవకాశముంటుంది. మరోవైపు.. చెన్నై జట్టులో ముఖ్యమైన ఫాస్ట్ బౌలర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతిషా పతిరానా లేకపోవడం సీఎస్కేకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.