Nagarjuna faces criticism from fans for negative role like in Coolie: తాను టాలీవుడ్ కింగ్ మర్చిపోయడా? లేదంటే, ఇక హీరోగా చేసింది చాలు అని అనుకుంటున్నాడా? అనేది అర్థం కాకుండా పోయింది. తన తోటి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. నాగార్జున మాత్రం ఇతర సినిమాల్లో కీలక పాత్రలు చేయడం మొదలు పెట్టారు. ఊపిరి, దేవదాస్ లాంటి సినిమాలు చేసినప్పటికీ.. అవి మల్టీస్టారర్‌గా మెప్పించాయి. బ్రహ్మాస్త్రలో నటించినప్పటికీ.. అది బాలీవుడ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌గా నిలిచింది. చివరగా హీరోగా ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కింగ్.. కుబేర సినిమాతో యూటర్న్ తీసుకున్నారు.
వాస్తవానికైతే నాగార్జున కొత్త సినిమా కోసం అక్కినేని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు నాగ్. మధ్యలో బిగ్ బాస్‌తో బిజీ అయ్యారు. త్వరలోనే కొత్త సీజన్ హోస్టింగ్‌కు రెడీ అవుతున్నారు. కానీ హీరోగా సినిమా ప్రకటించడం లేదు. కుబేరలో మంచి క్యారెక్టర్ చేశాడని అనిపించుకున్నప్పటికీ.. కూలీలో మాత్రం విలన్‌గా ఎందుకు చేశాడా? అని ఫ్యాన్స్ కాస్త ఫీల్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలో నాగార్జున ప్లేస్‌లో వేరు వారు ఎవరు ఉన్నా సరే సినిమా నడిచిపోయేది. ఎందుకంటే.. సైమన్ పాత్ర వల్ల నాగార్జునకు కొత్త వచ్చేది ఏమి లేనట్టుగానే ఆ పాత్రను ముగించాడు డైరెక్టర్ లోకేష్.
Also Read: Revanth Reddy: రాష్ట్రంలో కొత్త చరిత్ర రాశాం.. పాపాలు శాపాలై వెంటాడుతున్నా రాజీ పడలేదు!
అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ కూలీ సినిమా కథ వినకుండానే.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అని ఓకే చేశారు. కానీ నాగార్జున మాత్రం ఒకటికి నాలుగు సార్లు డైరెక్టర్ లోకేష్‌తో స్టోరీ సిట్టింగ్ వేశారు. ఈ లెక్కన సందేహంగానే కింగ్ ఈ సినిమా ఒప్పుకున్నారు. ఫైనల్‌గా ఆయన సందేహమే నిజమయ్యేలా సైమన్ రోల్ సైడ్ అయ్యేలా ఉంది. అందుకే కింగ్ ఇలాంటి నెగెటివ్ రోల్స్ ఆపేస్తే బెటర్ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చిరు, బాలయ్య, వెంకీ లాగా.. ఆయన హీరోగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి టాలీవుడ్ కింగ్ ఏం చేస్తారో చూడాలి. నాగ్ కొత్త సినిమా కోసం అక్కినేని ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.