NTV Telugu Site icon

Lionel Messi : మెస్సీపై పడ్డ అభిమానులు.. ఉక్కిరిబిక్కిరైన ఫుట్ బాల్ స్టార్

Messi

Messi

ఆర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. అయితే ఆ తర్వాత బౌన్సర్స్ వారిని చెదరగొట్టడంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి మెస్సీ భార్య, పిల్లలతో కలిసి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని డాన్ జూలియా రెస్టారెంట్ కు వెళ్లాడు. తనకిష్టమైన ఫుడ్ ను తిని అక్కడి నుంచి బయలుదేరాలనుకున్నాడు. అయితే అప్పటికే మెస్సీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు రెస్టారెంట్ బయట గూమిగూడారు. రెస్టారెంట్ నుంచి కారిడార్ లోకి వచ్చిన మెస్సీ వారికి అభివాదం చేశాడు.

Also Read : Narsaraopet Tension: టీడీపీ వర్సెస్ వైసీపీ …నరసరావుపేటలో ఉద్రిక్తత

ఈలోగా బయటకు వచ్చిన మెస్సీని అభిమానులు ఒక్కసారిగా చుట్టముట్టారు. దీంతో ఉక్కిరిబిక్కిరికి గురైన మెస్సీ భయపడి రెస్టారెంట్ లోపలికి వచ్చేశాడు. ఆ తర్వాత లోకల్ పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులు చెదరగొట్టారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) వరుస ఓటములు చవిచూస్తుంది. తాజాగా పార్క్ డెస్-ప్రిన్సెస్ టోర్నీలో రెనెస్ తో మ్యాచ్ లో 2-0 తేడాతో ఓటమి పాలయింది. దీనికి తోడు పీఎస్జీ మేనేజర్ తో మెస్సీకి గొడవలు ఉన్నాయంటూ.. త్వరలోనే మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్ క్లబ్ ను వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : Smriti Mandhana : కెప్టెన్ గా పనికిరాదు?.. స్మృతి మంధాన అసంతృప్తి..!

Show comments