Virat Kohli: విరాట్ కోహ్లీ వెజిటేరియన్ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Mock Chicken Tikka Post Confused to Fans: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ‘వెజిటేరియన్’ అన్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే విరాట్.. దాని కోసమే గతంలో వెజిటేరియన్‌గా మారాడు. వెన్నెముక సమస్య కూడా నాన్‌వెజ్ తినే కోహ్లీని వెజిటేరియన్‌గా మారేలా చేసింది. విదేశీ టూర్స్ వెళ్లినా కూడా కోహ్లీ ముక్క మాత్రం ముట్టుకోడు. అయితే తాజాగా ‘మాక్ చికెన్ టిక్కా’ తింటున్న ఫొటోను విరాట్ షేర్ చేయడంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారు.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేశాడు. ‘ఈ మాక్ చికెన్ టిక్కాను మీరు తప్పక ఇష్టపడతారు’ అంటూ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అభిమానులు తమ కామెంట్లకు పని చెప్పారు. కోహ్లీ వెజిటేరియన్ కదా.. ‘చికెన్ టిక్కా’ తినడం ఏంటి? అని కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఓ అభిమాని క్లారిటీ ఇచ్చాడు. ‘కొంతమందికి చికెన్ టిక్కాకు, మాక్ చికెన్ టిక్కాకు తేడా తెలియదు. మాక్ చికెన్ టిక్కా వెజిటేరియన్ ఫుడ్. ఇది ఓ మొక్క నుంచి తయారు చేసిన ఆహారం. అది తెలియని వారు కోహ్లీ నాన్‌వెజ్ తిన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు’ అని సమాధానం ఇచ్చాడు.
Also Read
- Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్‌నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
Also Read: Tabraiz Shamsi Celebrations: వాళ్లు అడిగారనే షూతో సంబరాలు చేసుకున్నా: తంబ్రిజ్ షంసి
వాస్తవానికి మాక్ చికెన్ టిక్కా నాన్‌వెజ్ కాదు. దీన్ని చికెన్‌తో అస్సలు తయారు చేయరు. దీనిని తయారు చేయడానికి సోయాను వాడతారు. ఓరకంగా చెప్పాలంటే.. ఇది వెజిటేరియన్ల నాన్‌వెజ్ ఫుడ్. రుచి పరంగా చికెన్ టిక్కాకు, మాక్ చికెన్ టిక్కాకు పెద్దగా తేడా ఉండదు. అందుకే మాంసాహారం మాక్ వెర్షన్‌ను సోయాతోనే తయారు చేస్తారు. విరాట్ కోహ్లీ నాన్‌వెజ్‌ను మానేసిన తర్వాత సోయాతో తయారు చేసిన మాక్ చికెన్‌ను తింటుంటాడు. కోహ్లీ తినేది చికెన్ కాదు సోయా.
తాజావార్తలు
-
Wamika Gabbi : ‘DC’తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్‌నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!