NTV Telugu Site icon

IND vs AUS: ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా ఆటగాళ్లు.. అభిమానులు చెట్లు ఎక్కి..!

Team India

Team India

నవంబర్ 22న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌ కోసం టీమిండియా పెర్త్‌లో నెట్స్‌లో కఠినమైన ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు సభ్యులందరూ ఆస్ట్రేలియా చేరుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌లు ర్యాన్ టెన్ డోస్చాట్, అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో బుధవారం పెర్త్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు మొత్తం జట్టు హాజరయ్యారు. WACA స్టేడియంలో ప్రతిరోజూ గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కో, జస్ప్రీత్ బుమ్రా చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం కనిపించింది.

Read Also: Leopard-Lion fight: పిల్లలను కాపాడుకునేందుకు సింహంతో తల్లి చిరుతపులి ఫైటింగ్.. చివరికి ఏమైందంటే..!

అయితే.. విరాట్‌ కోహ్లి ప్రాక్టీస్‌ చేస్తున్నారని తెలుసుకున్న అభిమానులు అతడిని చూడాలని అక్కడికి వచ్చారు. చాలా మంది అభిమానులు అతనిని చూడటానికి నిచ్చెన తెచ్చుకుని మరి.. చెట్లెక్కి కోహ్లీ ప్రాక్టీస్ చేయడం చూశారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు.. విడుదల చేసిన వీడియోలో వార్మప్ సెషన్ తర్వాత ఆటగాళ్లు బౌలింగ్ చేయడం, మరియు బ్యాటింగ్ చేయడం చూడవచ్చు. బౌలర్లు బౌలింగ్ బౌన్సర్లను ప్రాక్టీస్ చేయగా.. బ్యాట్స్‌మెన్ షార్ట్ బాల్ ఆడుతూ ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ సహా బ్యాట్స్‌మెన్ అంతా షార్ట్ బాల్ ఆడుతూ కనిపించారు. అదే సమయంలో.. హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌన్సీ వికెట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవడం కనిపించింది.

Read Also: Bangladesh: 90 శాతం మంది ముస్లింలు.. రాజ్యాంగం నుంచి ‘‘సెక్యులర్’’‌ని తొలగించాలి..

Show comments