చిత్తుగా ఓడిన కోహ్లీసేన…టీమిండియాపై అభిమానుల ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ పేస్‌కు ఈ ఇద్దరు విలవిలలాడారు. ఒత్తిడికి చిత్తయిన ఈ జోడీ ఆరంభంలోనే వికెట్లను పారేసుకొని వెనుదిరిగారు. దాంతో ఈ ఇద్దరిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ వడపావ్ తినాలని ఒకరంటే.. నట్టేట ముంచేసాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదని, తన ఆటతో తీవ్రంగా హర్ట్ అయ్యామని కామెంట్ చేస్తున్నారు.ఇక కోహ్లీ సింగిల్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడంతో భారత్ గట్టెక్కిందని అంతా భావించారు. కాని జట్టుకు భారీ స్కోరును అందించలేకపోయారు. ఇక బౌలర్ల సంగతి చెప్పనవసరం లేదు. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా పాకిస్థాన్ ఓపెనర్ల ముందు తేలిపోయారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఉదయం గౌతమ్ గంభీర్ ట్వీట్ చేసినప్పుడే మ్యాచ్ ఓడిపోతుందని డౌట్ వచ్చిందన్నారు అభిమానులు. గంభీర్ ట్వీట్‌పై మీమ్స్ పేల్చారు. ఇక ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతేనే కప్ కొడతామంటూ కవర్ చేస్తూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు దృశ్యం గుర్తు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు. పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ జరగలేదని.. ఎవరడిగినా అదే చెప్పాలంటూ వెంకీ మామా డైలాగ్‌తో టీమిండియాకు చురకలంటించారు. బయటే కాదు.. స్టేడియం లోపల కూడా అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. టీమిండియా అభిమానులను స్టేడియంలోనే ఆటపట్టించారు పాకిస్థాన్ ఫ్యాన్స్. ఇండియా ఓడిపోయిందని మొహం మీద పదే పదే చెప్పడంతో స్టేడియంలో టీమిండియా సపోర్టర్స్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!