NTV Telugu Site icon

MS Dhoni: ఆ విషయంలో ఇబ్బంది పడిన ధోనీ, సాయం చేసిన అభిమాని… వీడియో వైరల్

Dhoni

Dhoni

మహేంద్ర సింగ్ ధోని… క్రికెట్ చరిత్రలో సుస్థిరంగా నిలిచే పేర్లలో ఇది కచ్ఛితంగా ఒకటి. ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మాహీ… తన సింప్లిసిటీతో కూడా ఎంతో మందికి దగ్గరయ్యాడు. పెద్ద సెలబ్రెటీ అయి ఉండి కూడా ధోని సింపుల్ గా ఉంటాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. తన అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. గర్వం మచ్చుకైనా కనిపించని ధోని అభిమానులతో ఇట్టే కలిసిపోతూ ఉంటాడు. అయితే, ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

‘చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి… ఇలాంటి ప్రవర్తనే ఆయనను మిగిలిన సెలబ్రెటీల కంటే భిన్నంగా నిలపిందీ’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోలో ధోని తన స్నేహితుడితో కలిసి కారులో ఎక్కడికో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ధోని స్నేహితుడు కారు నడుపుతున్నాడు. అయితే, మార్గమధ్యంలో వారికి దారి తెలీకపోవడంతో అదేదారిలో వెళుతున్న ఓ బైకర్‌ ను ఆపిన ధోని దారి ఎటని అడిగాడు.

Also Read : Sushil Kumar : ఒకప్పుడు రూ.5 కోట్ల విన్నర్…. ప్రస్తుతం పాలమ్ముకుంటున్నాడు, అసలేమైంది?

‘అలా ముందుకు వెళితే నాలుగు రోడ్ల సర్కిల్ ఒకటి వస్తుంది. దాన్ని దాటి ముందుకెళితే రాంచీ వస్తుంది’ అని ఆ అభిమాని ధోనికి చెప్పాడు. ‘అది విగ్రహం ఉన్న సర్కిలేనా?’ అని ధోనీ మళ్లీ ఆ వ్యక్తిని అడగ్గా అతడు అవునని సమాధానం చెబుతాడు. ఆ తరువాత తన ఫ్యాన్‌తో సెల్ఫీ దిగి వెళ్లిపోయాడు ధోని. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ధోని సింప్లిసిటీపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

Show comments