Site icon NTV Telugu

Mrunal Thakur: రోజూ ఏడ్చేదాన్ని.. తెలుగు సినిమాల్లో నటించొద్దనుకున్నా: మృణాల్‌ ఠాకూర్‌

Mmm

Mmm

Mrunal Thakur on Telugu Language: హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. సీతారామం సమయంలో తెలుగు రాకపోవడం వల్ల తాను రోజూ ఏడ్చానని తెలిపారు. తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్‌ చేశానని చెప్పారు. హిందీ, మరాఠీల్లో కంటే తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని.. ఇక తెలుగు సినిమాల్లో నటించొద్దని తాను అనుకున్నానని మృణాల్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చారు. సీతారామం అనంతరం ‘హాయ్ నాన్న’తో మంచి హిట్ అందుకున్న మృణాల్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.

విజయ్ దేవకరొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌.. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటి సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. ‘ఎప్పటికైనా మహారాణి పాత్రలో నటించాలని నా చిన్నప్పటి కల. అందుకే సీతారామం సినిమా కోసం చిత్ర యూనిట్ సంప్రదించగానే.. వెంటనే ఓకే చెప్పా. సినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. భాష రాకపోతే నటించడం చాలా కష్టం. తెలుగు రాకపోవడం వల్ల రోజూ ఏడ్చేదాన్ని’ అని మృణాల్‌ తెలిపారు.

Also Read: Family Star: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. ర‌న్‌టైం ఎంతంటే?

‘తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని.. రాత్రంతా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. హిందీ, మరాఠీల్లో కంటే.. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. సీతారామం సినిమానే నా మొదటి, చివరి తెలుగు సినిమా అని షూటింగ్‌ జరిగేటప్పుడు దుల్కర్‌ సల్మాన్‌తో చెప్పాను. ఇక తెలుగులో అస్సలు సినిమా చేయనన్నాను. అందుకు దుల్కర్‌ నవ్వారు. ఈ సినిమా తర్వాత నీకు వరుస అవకాశాలు వస్తాయని నాతో అన్నారు. దుల్కర్‌ చెప్పిందే నిజమైంది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ కష్టాన్నంతా మర్చిపోయా. ఇప్పుడు తెలుగు చాలా ఈజీగా ఉంది’ అని మృణాల్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version