NTV Telugu Site icon

PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కుటుంబానికి రూ. 78,000.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం..

Pm Surya Ghar Muft Bijli Yojana

Pm Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ యోజన కింద సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ. 78,000లను అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ. 75,021 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ప్రధాని మోడీ ఫిబ్రవరి 13న ప్రారంభించారు. ఈ పథకం కుటుంబాలకు సహాయం చేయడమే కాకుండా సౌరశక్తి విడిభాగాల దేశీయ తయారీకి ఊతమిస్తుందని, 17 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుందని మంత్రి చెప్పారు.

Read Also: Naga Babu: 5 అడుగుల మూడు అంగుళాల హీరో గురించి మాట్లాడడం తప్పే.. క్షమించండి

సోలార్ విద్యుత్ పెంచే లక్ష్యం:

సబ్సిడీ కింద కోటి కుటుంబాలకు రూ. 78,000 రాయితీ అందించనునంది. మిగిలిన మొత్తాన్ని సదరు ఇంటి యజమాని భరించలేని పక్షంలో వారికి బ్యాంకు ద్వారా రుణం అందించనున్నారు. ఎండ ఉన్న రోజులో 1 kW సౌర విద్యుత్ ప్లాంట్ ఒక రోజులో 4 నుండి 5.5 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు.

ఈ పథకం కింది రూప్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థ కోసం కేంద్రం 2 కిలోవాట్ సిస్టమ్ ఖర్చులో 60 శాతం, 2-3 కిలోవాట్ల మధ్య ఉన్న సిస్టమ్‌కి రూ. 40 శాతం అదనపు ఖఱర్చు ఇవ్వబడుతుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థిక సాయం 3 కిలోవాట్ల వరకే పరిమితం చేయబడుతుంది.

దీని ప్రకారం .. 2 KW సోలార్ ప్యానెల్ కెపాసిటీ కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ఇళ్లకు కిలోవాట్‌కి రూ. 30,000 చొప్పున సబ్సిడీ ఉండనుంది. 3 కిలోవాట్లకు వరకు అదనపు సామర్థ్యం కోసం మరో కిలోవాట్‌కి రూ. 18,000 సబ్సిడీగా ఇవ్వనుంది.

దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో https://pmsuryaghar.gov.in/consumerRegistrationlలో నమోదు చేసుకోవచ్చు, అర్హత ఉన్న కుటుంబాలు ఇన్‌స్టాలేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పంపిణీ సంస్థ(డిస్కమ్) సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆమోదం తెలుపుతుంది.