Site icon NTV Telugu

Fraud : వర్కింగ్‌ వీసా పేరుతో మహిళలకు బురిడీ.. చివరికి..!

Fraud

Fraud

Fraud : అమాయకులకు మాయ మాటలు చెప్పి వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లంకపల్లి మేరీ అనే మహిళకు వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసా ఇప్పించాడు అకుమర్తి సత్యనారాయణ. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లంకపల్లి మేరీతో పాటు కొండలమ్మను ఇమిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేయడంతో వారు వర్క్ వీసాకు బదులు విసిటింగ్ వీసాపై వెళుతున్నట్లు తేలింది. దీంతో.. ఇద్దరు బాధితులను ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించడంతో సత్యనారాయణ చేతిలో మేరీ కొండలమ్మ మోసపోయినట్లు తేలింది. సత్యనారాయణ పై చీటింగ్, అక్రమ రవాణా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Fish Prasadam : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

Exit mobile version